పెట్టుబడి దారులకు శుభవార్త!. టాటా గ్రూప్‌ నుంచి ఐపీఓకి మరో సంస్థ | Sakshi
Sakshi News home page

పెట్టుబడి దారులకు శుభవార్త!. టాటా గ్రూప్‌ నుంచి ఐపీఓకి రానున్న మరో సంస్థ

Published Mon, Jan 8 2024 6:51 PM

Tata Group Initiates Talks For Ipo Of Tata Autocomp Systems - Sakshi

పెట్టుబడి దారులకు శుభవార్త. ప్రముఖ దేశీయ డైవర్సిఫైడ్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ నుంచి మరో సంస్థ ఐపీఓకి రానుంది. ఇటీవల టాటాగ్రూప్‌ 20 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్‌ ఐపీఓకి వచ్చింది. దాదాపు 2 దశాబ్ధాల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి ఐపీఓ రావడంపై మదుపర్లు ఆసక్తి చూపించారు. 

ఇప్పుడు వారి ఆసక్తిని మరింత రెట్టింపు చేసేలా టాటా గ్రూప్‌లో భాగమైన టాటా ఆటోక్యాప్‌ సిస్టమ్‌ (టీఏసీఓ) ఐపీఓకి తెచ్చేలా టాటా గ్రూప్‌ ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  

టాటా ఆటోక్యాప్‌ సిస్టమ్‌ సంస్థ వాహనాల తయారీకి కావాల్సిన విడి భాగాల్ని తయారు చేస్తుంది. ఈ సంస్థను ఐపీఓ తెచ్చే యోచనలో ట్రాప్‌ గ్రూప్‌ ఉంది. ప్రస్తుతం అవి ప్రారంభ దశలో ఉన్నాయి. 1995లో టీఏసీఓని టాటా గ్రూప్ నిర్మించింది. ఇందులో టాటా సన్స్‌ 21 శాతం వాటా ఉండగా.. మిగిలిన మొత్తం టాటా ఇండస్ట్రీస్‌కి ఉంది. 
 

 
Advertisement
 
Advertisement