వాహ్‌.. తాజ్‌..!

Taj named world strongest hotel brand by Brand Finance  - Sakshi

హోటళ్లలో ‘తాజ్‌’కు తిరుగులేదు!

ప్రపంచంలోనే బలమైన బ్రాండ్‌

బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: టాటాలకు చెందిన ‘తాజ్‌’ ప్రపంచంలోనే బలమైన హోటల్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ‘హోటల్స్‌ 50 2021’ పేరుతో బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కానీ ‘తాజ్‌’ హోటళ్లు బలంగా నిలబడినట్టు నివేదిక అభిప్రాయపడింది. టాటా గ్రూపునకు చెందిన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) కింద తాజ్‌ హోటళ్లు నడుస్తుండడం గమనార్హం. 2016లో తాజ్‌ బ్రాండ్‌ ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తొలిసారి ఈ జాబితాలోకి ప్రవేశించడమే కాకుండా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 

‘ఈ అంశాల ఆధారంగా చూస్తే తాజ్‌ బ్రాండ్‌ విలువ 296 మిలియన్‌ డాలర్లతో (రూ.2,200 కోట్లు) ప్రపంచంలో బలమైన హోటళ్ల బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌లో 100కు గాను 89.3 స్కోర్‌ను సంపాదించుకుంది. ఇది ఏఏఏ బ్రాండ్‌ రేటింగ్‌కు సమానం’’ అని బ్రాండ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. తాజ్‌ తర్వాత ప్రీమియన్‌ ఇన్‌ రెండో స్థానంలో, మెలియా హోటల్స్‌ ఇంటర్నేషనల్‌ మూడో స్థానంలో, ఎన్‌హెచ్‌ హోటల్‌ గ్రూప్, షాంగ్రి లా హోటల్స్‌  తర్వాతి రెండు స్థానాల్లోనూ ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top