శాటిలైట్‌ నెట్‌ రేసులో మస్క్‌ కన్నా ముందున్నాం.. | Sunil Mittal Says India Is Ahead of Elon Musk Satellite Internet Race | Sakshi
Sakshi News home page

శాటిలైట్‌ నెట్‌ రేసులో మస్క్‌ కన్నా ముందున్నాం..

Oct 15 2026 8:32 AM | Updated on Oct 15 2026 8:51 AM

Sunil Mittal Says India Is Ahead of Elon Musk Satellite Internet Race

దేశీ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసుల విషయంలో కార్పొరేట్ల మధ్య మాటల పోరు కొనసాగుతోంది. తాజాగా భారత్‌లో ఈ సర్వీసులను ప్రారంభించే రేసులో ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ కన్నా తమ యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ వెంచరే ముందుందని, అనుమతుల కోసం ఐదేళ్ల నుంచి నిరీక్షిస్తున్నామని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ తెలిపారు.

‘మేము ఈ క్యూలో ఆయన (మస్క్‌) కన్నా చాలా ముందున్నాం. మేము ఐదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నాం. మూడేళ్లుగా మా వన్‌వెబ్‌ గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉంది. ఉపగ్రహాలు ఐదేళ్లుగా భారత్‌ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ మాకింకా అనుమతులు రాలేదు. ఆయన కన్నా కనీసం కొద్ది రోజులు ముందైనా వస్తే చాలా సంతోషం’ అని బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరం 2026లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్‌ పేర్కొన్నారు.

శక్తివంతమైన వ్యాపార శక్తులు భారత్‌లో తమను రానివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ మస్క్‌ ఆరోపిస్తుండటం, నేరుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని లక్ష్యంగా చేసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో మిట్టల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్టార్‌లింక్, రిలయన్స్‌ జియో శాట్‌కామ్, యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌లకు శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ లైసెన్సులు వచ్చినప్పటికీ ఇంకా సెక్యూరిటీకి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉంది.

ఏఐని అలా వదిలేయకూడదు..

కృత్రిమ మేథ (ఏఐ)ని ఎదగనివ్వకుండా నిరోధించరాదని, అలాగని ఎలాంటి కట్టడి లేకుండా దాన్ని వదిలేయడం కూడా ’మూర్ఖత్వం’ అవుతుందని మిట్టల్‌ వ్యాఖ్యానించారు. ఏఐ అనూహ్యమైన విధంగా వ్యవహరిస్తుండటంపై అంతర్జాతీయ దిగ్గజాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై సముచిత విధంగా నియంత్రణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐకి సంబంధించి నిబంధనలు, కట్టడి చర్యలపై భారత్‌ చర్చాపత్రాన్ని రూపొందిస్తోందని మిట్టల్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement