మార్కెట్‌లో యుద్ధ భయాలున్నా లాభాల్లో సూచీలు | stock market updates on june 24 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: మార్కెట్‌లో యుద్ధ భయాలున్నా లాభాల్లో సూచీలు

Jun 24 2025 10:05 AM | Updated on Jun 24 2025 10:20 AM

stock market updates on june 24 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 192 పాయింట్లు పెరిగి 25,171కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 620 ప్లాయింట్లు పుంజుకుని 82,526 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేశారు. అయితే దీన్ని ఇరాన్‌ ఖండించింది.

ఇదీ చదవండి: ఐఫోన్‌ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్‌

ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా దాడితో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్రూడాయిల్‌ ధరలూ అయిదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో ఐటీ, టెక్, ఆటో షేర్లలో భారీ అమ్మకాలు నెలకొన్నాయి. అయితే ట్రేడింగ్‌ చివర్లో దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత తగ్గాయి. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు మళ్లీ భగ్గుమని, కాస్త చల్లారాయి. ఈ నేపథ్యంలో ఆయిల్‌ మార్కెటింగ్, ఏవియేషన్‌ రంగాల షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement