సాక్షి మనీ మంత్ర: బుల్‌జోరు.. గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: బుల్‌జోరు.. గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

Apr 10 2024 9:23 AM | Updated on Apr 10 2024 9:23 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22,703కు చేరింది. సెన్సెక్స్‌ 203 పాయింట్లు పుంజుకుని 74,883 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 89.49 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.14 శాతం లాభాలతో ముగిసింది. నాస్‌డాక్‌ 0.32 శాతం లాభపడింది. 

రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్‌ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌.. ఫండ్స్‌ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. అమెరికాలో వడ్డీ రేట్ల కోతపై సానుకూల అంచనాలు ఉన్నాయి. జరగబోయే ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడొచ్చన్న ఊహాగానాలతో మార్కెట్‌లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement