సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Mar 18 2024 3:35 PM | Updated on Mar 18 2024 3:36 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,055 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 104 పాయింట్లు దిగజారి 72,748 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎం అండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, మారుతి సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. 

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, నెస్లే, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐటీఎస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement