
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్థిరంగా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 23,668 వద్దకు చేరింది. సెన్సెక్స్ 32 పాయింట్లు ఎగబాకి 78,017 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్ సూచీలు ఈరోజు ఒడిదొడుకులకు లోనయింది. భారీగా పెరిగిన మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్ల మంగళవారం లాభాలు స్వీకరించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టైటాన్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటర్స్ స్టాక్‌లు నష్టపోయాయి.
ఇదీ చదవండి: ఒకే ఏడాదిలో 1800 కోట్ల గంటలు వేచి ఉన్నారట!
ఈ రోజు మార్కెట్ల ఒడిదొడుకులకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనలపై ఆందోళనలు పెరిగాయి. ఏప్రిల్ 2న ఏమేరకు టారిఫ్ నిర్ణయాలుంటాయోనని పెట్టుబడిదారులు ముందునుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)