కొత్త మార్గాల్లో స్టార్ ఎయిర్ సర్వీసులు - ధరలు ఇలా! | Star Air Introduces New Routes | Sakshi
Sakshi News home page

కొత్త మార్గాల్లో స్టార్ ఎయిర్ సర్వీసులు - ధరలు ఇలా!

Sep 22 2023 7:20 AM | Updated on Sep 22 2023 7:21 AM

Star Air Introduces New Routes  - Sakshi

బెంగళూరు: హైదరాబాద్‌–నాగ్‌పూర్‌–అజ్మీర్‌ రూట్‌లో సెప్టెంబర్‌ 30 నుంచి విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు సంజయ్‌ ఘొడావత్‌ గ్రూప్‌లో భాగమైన స్టార్‌ ఎయిర్‌ తెలిపింది. 

ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించిన ఆర్‌సీఎస్‌–ఉడాన్‌ స్కీములో భాగంగా తమకు లభించిన 40 రూట్లలో ఇవి కూడా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

దీని ప్రకారం హైదరాబాద్‌–నాగ్‌పూర్‌–అజ్మీర్‌ (కిషన్‌గఢ్‌) ఎకానమీ టికెట్టు ధర రూ. 5,499గా, బిజినెస్‌ క్లాస్‌ టికెట్టు రేటు రూ. 10,999గా ఉంటుంది. హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ రూట్లో టికెట్ల రేట్లు వరుసగా రూ. 3,499 .. రూ. 8,999గా ఉంటాయి.  

Advertisement
 
Advertisement
Advertisement