అటు పెట్రో సంక్షోభం: ఇటు రహమాన్‌ పాటకు డాన్స్‌తో ఫిదా!

Srilanka Economic Crisis: Man Dance attracts internet at petrol queue - Sakshi

కొలంబో: శ్రీలంక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో కుదేలవుతోంది. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక విదేశీ దిగుమతులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో పడిపోయింది ద్వీప దేశ శ్రీలంక.  నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.   

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు,  భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్‌ రేట్లతో జనం నానా  అగచాట్లు పడుతున్నారు. ముఖ‍్యంగా  రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోలు ధరలకు తోడు అక్కడి ప్రభుత్వ ఆంక్షలు సామాన్య జనానికిచుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు పెట్రోలు బంకుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా  క్యూలైన్‌లో  ఒక ఆటో  డ్రైవర్‌ డాన్స్‌  ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌  చేస్తోంది. ఏఆర్‌రహమాన్‌ స్వరపర్చిన ముక్కాలా.. ముకాబులా పాట ఆయన చేసిన డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top