న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, విపత్తుల వల్ల కలిగే నష్టాలకు బీమా కవరేజీని.. చిన్న నివాసాలు, చిన్న వ్యాపార సంస్థలకు ఆఫర్ చేసే విషయంలో వినూత్న పాలసీల రూపకల్పనకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. నివాసాలు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు ప్రామాణిక బీమా ఉత్పత్తులకు సంబంధించి ఈ మార్గదర్శకాలు అమలవుతాయి. భారత్ గృహ రక్ష, భారత్ సూక్ష్మ ఉదయం సురక్ష, భారత్ లఘు ఉదయం సురక్షా స్థానంలో స్టాండర్ బీమా ఉత్పత్తులను బీమా సంస్థలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది.
చదవండి: లైఫ్‌కి ఇన్సురెన్స్ ఉండాలంతే!

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
