భారత ఎకానమీపై స్పానిష్‌ పేపర్‌ కార్టూన్‌ దుమారం

Spain NewspaperFront Page Snake Charmer To Portray India Economic Growth Sparks Debate - Sakshi

న్యూఢిల్లీ:  భారత ఆర్థిక వ్యవస్థపై స్పెయిన్‌కు చెందిన ప్రధాన పత్రిక  అవమానకర కథనం  కలకలం  రేపింది.   భారత ఆర్థిక వృద్ధిపై  కథనాన్ని ప్రకటించిన  ‘లా వంగార్డియా’  పత్రిక‘పాములు ఆడించే వ్యక్తి’ ప్రతిబింబించే కార్టూన్‌ను పబ్లిష్‌ చేసింది. అక్టోబర్ 9న వీక్లీ పత్రిక మొదటి పేజీలో ఈ కార్టూన్‌ ప్రచురితమైంది. ఇది దేశంపై జాతివిద్వేషాన్ని వెళ్లగక్కడం తప్ప  మరోకటి కాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. 

‘ది హవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ’ పేరిట భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని వర్ణించడంపై బెంగళూరు సెంట్రల్ బీజేపీ లోక్‌సభ ఎంపీ పీసీ మోహన్  సీరియస్‌గా స్పందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా తమను పాముల్ని ఆడించేవాళ్లగా చూపడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు.  అంతేకాదు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియాకు గ్లోబల్‌గా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. విదేశీ మనస్థత్వాలనుమార్చాలనే ప్రయత్నం కాస్త కష్టమేనని పేర్కొన్నారు.

మరోవైపు రచయిత రజత్ సేథి కూడా దీనిపై స్పందించారు. భారత ఆర్థికవృద్ధిని ప్రపంచం గమనిస్తోంది. అయినా  జాత్యహంకార వ్యంగ్య చిత్రాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచమంతా గమనిస్తోంది. కానీ భారత్‌ను ఇంకా సాంప్రదాయ కార్టూన్లతో చూపించడం చాలా అవమానకరం.  కార్టూన్‌తో  దేశాన్ని అవమానించడం చాలా దారుణమని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జిరోధా సీఈవో నితిన్ కామన్ వ్యాఖ్యానించారు.  పాములు పట్టే దేశంగా అభివర్ణించడం సరైంది కాదని ఆయన ట్వీట్‌ చేశారు. ఎకానమీతో పాటు, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇండియా దూసుకుపోతున్నా భారత్‌ను పాములు పట్టే దేశం అంటూ అవమానకర కార్టూన్‌ను ప్రచురించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top