గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న స్నాప్‌ డీల్‌ కో-ఫౌండర్‌

Snapdeal Co Founder Kunal Bahl Recalled His Shocking Nepal Flight Experience - Sakshi

నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. 

వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ఈ సంఘ‌ట‌న‌లో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు.

ఇక ఈ విమాన ప్రమాదంపై స్నాప్‌ డీల్‌ కో-ఫౌండర్‌ కునాల్‌ బహ్ల్‌ విచారం వ్యక్తం చేశారు. నేపాల్‌ విమాన ప్రమాద వార్తని ట్వీట్‌ చేశారు. గతంలో బిజినెస్‌ పనిమీద పొఖారాకు వెళ్లిన బహ్ల్‌కు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 

‘ఇది నిజంగా విచారకరం. కొన్ని సంవత్సరాల క్రితం నేను పోఖారాకు వెళ్లాను. నేను ప్రయాణిస్తున్న విమానం కిటికీలకు ఏర్పడిన పగుళ్ల కారణంగా ఆకాశ మార్గంలో ఉండగా.. బయట నుంచి గాలి విమాన కిటికీల పగుళ్ల గుండా లోపలికి వస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేను వెంటనే పక్కనే ఉన్న  ఎయిర్‌ హోస్ట్‌కి సమాచారం అందించా. ఆమె ఓ టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టి గాలి లోపలికి రాకుండా ప్రయత్నించింది.  

నా దృష్టిలో అదే అంత్యత వరస్ట్‌ డే. నాటి నుంచి మళ్లీ పోఖారాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్‌లో తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top