నేపాల్‌ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి

Folk Singer Nira Chhantyal Died In Nepal Plane Crash - Sakshi

నేపాల్‌లో ఆదివారం జ‌రిగిన విమాన ప్ర‌మాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘ‌ట‌న‌లో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సౌత్‌ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అర్జెంటీనా దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి ఇప్పటి వరకు  ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలం వద్ద రెస్కూ చర్యలు సోమవారం తిరిగి ప్రారంభించారు. 

జానపద గాయని మృతి
విమానం కుప్పకూలిన ప్రమాదంలో నేపాల్ ప్ర‌ముఖ జాన‌ప‌ద గాయ‌ని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చ‌నిపోయింద‌నే విష‌యాన్ని ఆమె సోద‌రి హీరా ఛాంత్య‌ల్ షెర్చాన్ వెల్లడించింది. ‘పోఖారాకు విమానంలో బ‌య‌లుదేరిన నీరా మ‌ర‌ణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సంద‌ర్భంగా పోఖారరాలో నిర్వ‌హిస్తున్న ఓ ఈవెంట్‌లో పాల్గొన‌డం కోసం వెళ్లింది. అంత‌కుముందు నీరా.. అభిమానుల‌కు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారాలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది.

ఎవ‌రీ నీరా?
కాగా నేపాల్‌లోని బగ్‌లుండ్‌ ప్రాంతంలో పుట్టి పెరిగన నీరా.. కొంతకాలంగా రాజధాని ప్రాంతమైన ఖాట్మాండులో నివసిస్తోంది. జానపద పాటలలో పాపులారిటీ సాధించిన ఆమె గొంతుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జాతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్తధారణతో ఈవెంట్స్‌లో పాల్గొనే నీరా తన పాటలనుసోషల్‌ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది.  అయితే నీరా ప్ర‌యాణిస్తున్న విమానం ప్ర‌మాదానికి గుర‌వ్వ‌డంతో మాఘ్ సంక్రాంతి కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేశామ‌ని నేపాల్ ఛంత్యాల్ యువ‌జ‌న సంఘం అధ్య‌క్షుడు న‌వీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపారు.

చదవండి: నేపాల్‌ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు..

బ్లాక్‌ బాక్స్‌ స్వాధీనం
తాజాగా ఆర్మీ అధికారులు సంఘటన స్థలం నుంచి బ్లాక్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని ఖాట్మండు విమానాశ్రయ అధికారి షేర్ బాత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఈ బ్లాక్‌ బాక్స్‌ ద్వారా కాక్‌పిట్‌లో పైలెట్ల మధ్య సంభాషణను రికార్డ్‌ చేస్తోంది. అంతేగాక ఫ్లైట్‌ డేటా ఇందులో రికార్డ్‌ అవుతుంది. ఈ బ్లాక్‌ బాక్స్‌ సహాయంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top