
నేటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపార యజమానులందరూ సులభంగా, వేగంగా, సురక్షితంగా పని చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ స్మార్ట్ టూల్స్ ప్రయత్నించాల్సిందే!
పేపర్ ప్లస్ డిజిటల్ మ్యాజిక్
ఒకప్పుడు నోట్స్ రాస్తే కేవలం కాగితాలకే పరిమితం అయ్యేది. ఒక్క కాగితం మిస్ అయినా, రాసిన మాట, గీసిన డ్రాయింగ్ అంతా మాయం అవుతుంది. ఇప్పుడు ‘హుయిన్ డిజిటల్ నోట్‌బుక్’తో ఆ భయం పూర్తిగా తొలగింది. ఇది కేవలం ఒక నోట్‌బుక్ కాదు, పేపర్ ప్లస్ డిజిటల్ టాబ్లెట్. ఇందులో రాసిన ప్రతి అక్షరం, గీసిన ప్రతి లైన్ వెంటనే మీ డివైస్‌లో స్టోర్ అవుతుంది. ఆడియో రికార్డ్ ఫీచర్‌తో, మీ వాయిస్ కూడా నోట్స్‌తో కలిసి రికార్డ్ అవుతుంది. ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు కూడా. పేజీలను మిళితం చేయడం, విడగొట్టడం చాలా సులభం. ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడానికి సులభమైన టూల్స్ కూడా ఉన్నాయి. ధర రూ. 7,105 ల ప్యాక్‌లో ఒక హుయిన్ నోట్, ఏ ఐ నోట్ ప్యాడ్, యూఎస్బీ కేబుల్, మాగ్నెటిక్ పెన్ స్లీవ్, రీఫిల్స్, ప్లాస్టిక్ పెన్ నిబ్స్, మార్గదర్శక పుస్తకంతో వస్తుంది.

ఒక్క కార్డు చాలు!
ఒకప్పుడు పాత పేపర్ విజిటింగ్ కార్డ్ అంటే స్టేటస్ సింబల్. ‘ఇదిగో నా కార్డ్’ అంటూ ఇచ్చేసి స్టయిల్ కొట్టేవాళ్లు. కాని, నిజం చెప్పాలంటే ఆ కార్డుల ఫ్యూచర్ బాగుండేది కాదు. రోజుల తరబడి జేబులో మురిగి, కాఫీ కప్పుల కింద నలిగి, చివరికి ఏ డస్ట్‌బిన్‌లోనో ఎండ్ అయ్యేది. అలాంటప్పుడు వాటికోసం అనవసరంగా ఖర్చు ఎందుకు చేయటం. కేవలం, ఒక్క టాప్‌తోనే మీ పేరు, నంబర్, వెబ్‌సైట్, సోషల్ మీడియా అన్నీ ఎదుటివారి మొబైల్‌లో బజ్ అయ్యే మాయ చేస్తుంది ఈ ‘టాప్‌మో స్మార్ట్ బిజినెస్ కార్డ్’. ఇందులో చిన్న లోగో, క్యూ ఆర్ కోడ్, లైఫ్‌టైమ్ వాలిడిటీ అన్నీ రెడీ! యాప్ డౌన్‌లోడ్ అనే తలనొప్పి లేదు, ‘కార్డులు అయిపోయాయి’ అనే టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చు కూడా. ధర కేవలం రూ. 599 మాత్రమే!

పోర్టబుల్ సర్వర్
స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కు కస్టమర్ డేటా, ఫైనాన్స్ రికార్డులు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ రక్షించుకోవాలంటే పెద్ద సర్వర్ అవసరమా? లేనే లేదు! బిజినెస్ డీటైల్స్ అన్నీ ఒకే చోట, సురక్షితంగా ఉంచాలంటే ‘అప్రికార్న్ ఏజిస్ ప్యాడ్‌లాక్’ బెస్ట్ ఆప్షన్. 480 జీబీ స్టోరేజ్, 256–బిట్ ఎన్‌క్రిప్షన్, రగ్‌డ్ బాడీ, టూ స్టెప్ వెరిఫికేషన్‌తో ఏ ఫైల్ అయినా సేఫ్‌గా స్టోర్ చేస్తుంది. ఇది కేవలం స్టోరేజ్ సర్వర్ మాత్రమే కాదు, చిన్న బిజినెస్‌కి నమ్మకమైన డేటా గార్డు. ఆఫీస్‌లోనైనా, ఇంట్లోనైనా, ట్రావెల్‌లోనైనా సులభంగా ఉపయోగించవచ్చు. చిన్న, పోర్టబుల్ బాడీతో జేబులోనైనా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఏకకాలంలో డేటా యాక్సెస్, బ్యాకప్, షేర్ అన్నీ సులభం. ధర రూ. 49,325.
