దేశంలో ఇప్పటి వరకు నాలుగు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇంకా మూడు దశల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలతో పాటు స్టాక్ మార్కెట్ బ్రోకర్లపై విధించే పన్నులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇటీవల జరిగిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ను స్టాక్ మార్కెట్ లావాదేవీలతో పాటు ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే పన్నుల గురించి స్టాక్ బ్రోకర్ అడిగారు. తాను డబ్బును పెట్టుబడి పెట్టడంతోపాటు నష్టాలను కూడా భరిస్తున్నానని, అయితే ప్రభుత్వం దాదాపుగా తన “స్లీపింగ్ పార్టనర్” లాగా ఉందని అన్నారు.
ప్రభుత్వం మాత్రమే జీఎస్టీ, ఐజీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ నుంచి ప్రభుత్వం బాగానే ఆదాయాన్ని గడిస్తోందని అన్నారు. దీనికి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. స్లీపింగ్ పార్టనర్ ఇక్కడ కూర్చుని సమాధానం చెప్పలేదని చమత్కరించారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)తో కలిసి పనిచేయాలని బిఎస్‌ఇకి మంత్రి విజ్ఞప్తి చేశారు.
The Government of India is my sleeping partner. 😩
FM Nirmala Sitharaman Stumped By This Question At BSE by stock market investor. pic.twitter.com/tr7yD9yQdg— Pankaj Parekh (@DhanValue) May 16, 2024
Comments
Please login to add a commentAdd a comment