హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా ఎస్‌యూవీ కొడియాక్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది.

జనవరి–మార్చిలో డెలివరీలు ఉంటాయని కంపెనీ బుధవారం ప్రకటించింది.

ఎక్స్‌షోరూంలో ధర రూ.37.49 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

గతంలో కొడియాక్ బుకింగ్స్‌ను కంపెనీ జనవరిలో ప్రారంభించింది.


