కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్‌!

Shock To Canara Bank Customers: Hikes Lending Rates By 15 To 25 Bps Across Tenors - Sakshi

ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ కొత్త సంవత్సరం తన కస్టమర్లకు షాకిచ్చింది. జనవరి నెల నుంచి రుణ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం పడనుంది. తాజా పెంపుతో రుణగ్రహితలపై అధిక వడ్డీల భారం పడనుంది. ఇప్పటికే పలు బ్యాంకుల తమ వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే.

కెనరా బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెంపు నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

రేట్ల పెంపు తర్వాత వీటిపై లుక్కేస్తే.. ఓవర్ నైట్, ఒకనెల రోజులకు ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతంగా ఉండగా, 3 నెలలకు ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.2 శాతం, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం పెంచిన కొత్త రేట్లు కారణంగా ఇకపై కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. వీటితో పాటు రెన్యూవల్, రీసెట్ డేట్ తర్వాత కూడా ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయి.  

చదవండి: అమెజాన్‌: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top