
వారసత్వ ప్రణాళికను క్రమబద్దీకరించడానికి.. ఫ్యామిలీ హోల్డింగ్‌లను ఏకీకృతం చేయడానికి, ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా.. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ 'శివ్ నాడార్' (Shiv Nadar) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హెచ్‌సీఎల్ కంపెనీలో మాత్రమే కాకుండా.. ప్రమోటర్ కంపెనీలైన వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ (ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్‌లలోని తనకు చెందిన మొత్తంలో 47 శాతం వాటాను తన కుమార్తె 'రోష్ని నాడార్ మల్హోత్రా'కు బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్‌లను అమలు చేశారు.
ఈ బదిలీలకు ముందు, శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రా రెండు సంస్థలలోనూ వరుసగా 51%, 10.33% వాటాలను కలిగి ఉన్నారు. లావాదేవీల తరువాత, HCL కార్పొరేషన్, VSIPL లలో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి, శివ్ నాడార్ వాటా 4 శాతానికి చేరుకున్నాయి.
రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra)
టెక్ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు 'శివ్ నాడార్'కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్ని.. వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సీఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈఓగా బాధ్యతలు కూడా చేపట్టారు.
ఇదీ చదవండి: నెలకు ఒకరోజు సెలవు.. దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment