మార్కెట్లు అదుర్స్‌- సెన్సెక్స్‌ ట్రిపుల్‌ | Sensex- Nifty hits new highs again | Sakshi
Sakshi News home page

మార్కెట్లు అదుర్స్‌- సెన్సెక్స్‌ ట్రిపుల్‌

Nov 11 2020 9:40 AM | Updated on Nov 11 2020 10:22 AM

Sensex- Nifty hits new highs again - Sakshi

ముంబై: మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. వరుసగా 8వ రోజు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 318 పాయింట్లు జంప్‌చేసి 43,596ను తాకగా.. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 12,735 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,753కు చేరగా.. సెన్సెక్స్‌ 43,675ను అధిగమించింది. వెరసి మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. నిఫ్టీ-50 మార్కెట్‌ క్యాప్‌(విలువ) రూ. 100 లక్షల కోట్లను అధిగమించడం విశేషం! చదవండి: (మళ్లీ చమురు ధరల సెగ)

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్‌ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, ఎంఅండ్‌ఎం, హీరో మోటో, కొటక్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ, దివీస్‌ ల్యాబ్స్‌, హిందాల్కో, ఐటీసీ 4-1.5 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ అదికూడా 0.7-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఎన్‌ఎండీసీ వీక్‌
డెరివేటివ్ కౌంటర్లలో బాలకృష్ణ, సెయిల్‌, లుపిన్‌, ఐబీ హౌసింగ్‌, అరబిందో, అపోలో హాస్పిటల్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, జీ, ఐజీఎల్‌, ఎస్కార్ట్స్‌, పీఎన్‌బీ, సన్‌ టీవీ 4-2 శాతం మధ్య జంప్‌ చేశాయి. అయితే ఎన్‌ఎండీసీ 4 శాతం పతనంకాగా.. బాటా, జీఎంఆర్, అపోలో టైర్‌, ఇండిగో, ఐడియా, హావెల్స్‌, వోల్టాస్‌ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,119 లాభపడగా.. 551 నష్టాలతో కదులుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement