
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసాయి. రేపటి బడ్జెట్‌కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. ఫలితంగా రోజంతా ఒడి దుకుడుల మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 59550 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 17662 వద్ద స్థిరపడ్డాయి.
మెటల్, ఆటో షేర్లు లాభపడగా, ఐటీ ఫార్మ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు నష్ట పోయాయి. ఎంఅండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ లాభపడగా, బజాజ్‌ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్ర, సన్‌ఫార్మ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 42 పైసలు నష్టంతో 81.50 వద్ద ముగిసింది.