
భారీ లాభాలతో మొదలైన సూచీలు..!
వరుస నష్టాలకు బ్రేక్ ఇస్తూ...బుధవారం రోజున లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్ నేడు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలమైన ఒపెనింగ్‌తో గురువారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనలతో ఎషియన్ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
గురువారం ఉదయం 9.50 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 457.04 పాయింట్లు పెరిగి 57,511వద్దకు చేరుకోగా, ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 17,260 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్-100 షేర్లు 0.76 శాతం, స్మాల్ క్యాప్ 1.14 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా కదలాడుతున్నాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, మారుతీ, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టి, అదానీ పోర్స్ట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే ఇండియా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
చదవండి: కీలక నిర్ణయం..వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్..!