
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు అంతర్జాతీయంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా వెల్లువెత్తిన కొనుగోళ్ల అండతో దూసుకెళ్లయి. చివరకు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 151.81 పాయింట్లు (0.28%) పెరిగి 54554.66 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 21.80 పాయింట్లు (0.13%) పెరిగి 16280.10 వద్ద ముగిసింది. నేడు సుమారు 679 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 2401 షేర్లు క్షీణిస్తే, 98 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 74.41 వద్ద ఉంది. భారతి ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎం అండ్ ఎం షేర్లు నేడు లాభాలను పొందితే.. శ్రీ సిమెంట్స్, జెఎస్ డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐఓసీ షేర్లు నష్టపోయాయి.