భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు: 1032 పాయింట్ల ర్యాలీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మొదలైన సూచీలు చివరి వరకూ అదో జోష్‌ను కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిసి 59 మార్క్‌ను తాకింది. చివరకు 1032 పాయింట్ల లాభంతో 58991 వద్ద ముగిసింది. ఎగువకు చేరగా నిఫ్టీ 279 పాయింట్లు ఎగిసి 17 400వద్ద న బలమైన నోట్‌తో ముగిసింది .
(ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు)
ప్రధానంగా ఐటీ 2 శాతం ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ కాగా, నష్టపోయిన వాటిలో అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ , బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి 15 పైసలు పెరిగి 82.18 వద్ద ముగిసింది
మరిన్ని వార్తలు :