డ్రాగన్‌ కంట్రీలో అలజడి: సూచీల పరుగుకు బ్రేక్‌  | Sensex and Nifty turns into green | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ కంట్రీలో అలజడి: సూచీల పరుగుకు బ్రేక్‌ 

Nov 28 2022 10:12 AM | Updated on Nov 28 2022 11:48 AM

Sensex and Nifty turns into green - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరించడం, లాక్‌డౌన్‌ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు  బలహీనపడ్డాయి. ఆదివారం షాంఘైలో ప్రదర్శనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ, ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో COVID-19 నిర్వహణపై ఆందోళనలు ఆసియా మార్కెట్ల పతనానికి  దారి తీసాయి. దీంతో  దేశీయ మార్కెట్లలో వరుస లాభాలకు చెక్‌ పడింది.  అయితే  ప్రస్తుతం నష్టాలనుంచి తేరుకుని సెన్సెక్స్‌, నిఫ్టీ స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 97 పాయింట్లు ఎగిసి  62,396 , నిఫ్టీ పాయింట్లు లాభంతో 18532వద్ద   పటిష్టంగా కొనసాగుతున్నాయి.

బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.  బీపీసీఎల్‌, ఎస్‌బీఐ లైఫ​, హీరో మోటో, రిలయన్స్‌, టాటా మోటార్స్‌ టాప్‌ విన్నర్స్‌గా,  హిందాల్కో, అపోలో హాస్పిటల్స్‌,హెచ్‌డీఎఫ్‌సీ,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టపోతున్నాయి.  అటు డాలరు మారకంలో రూపాయి  స్వల్ప నష్టాల్లో 81.73 వద్ద ఉంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement