అదానీ జోరు: సెన్సెక్స్‌ హై జంప్‌ | Sensex and Nifty surges higherAdani twins SBI top gainers | Sakshi
Sakshi News home page

అదానీ జోరు: సెన్సెక్స్‌ హై జంప్‌

Mar 3 2023 3:20 PM | Updated on Mar 3 2023 3:41 PM

Sensex and Nifty surges higherAdani twins SBI top gainers - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో హుషారుగా ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో  ఆరంభంలోనే లాభపడింది. ఆ తరువాత  మరింత ఎగిసిన సెన్సెక్స్‌ 980 పాయింట్లు ఎగిసి 59,888 స్థాయిని,  నిఫ్టీ  298 పాయింట్ల లాభంతో 17,619 స్థాయిని తాకాయి. ప్రధానంగా అదానీ గ్రూప్ షేర్ల  వరుసగాలాభాలు సూచీలకు ఊతమిచ్చాయి. చివరికి సెన్సెక్స్‌ 900 పాయింట్లు ఎగిసి  597808 వద్ద, నిఫ్టీ  272 పాయింట్ల లాభంతో 17594 వద్ద ముగిసింది. 

అదానీ జోరు
అదానీ ఎంటర్‌ప్రైజెస్  11 శాతం  అదానీ పోర్ట్స్ స్టాక్ 7.96 శాతం అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం  ర్యాలీ అయ్యాయి.  అదానీ పవర్ 4.99 శాతం జంప్ చేసింది. దాదాపు చాలా షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ అయ్యాయి. 

అదానీ విల్మార్ షేర్లు 4.99 శాతం, ఎన్‌డిటివి (4.98 శాతం), అంబుజా సిమెంట్స్ (4.38 శాతం), ఎసిసి (3.69 శాతం) పెరిగాయి.అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, భారతి ఎయిర్టెల్‌, రిలయన్స్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలవగా, టెక్‌ మహీంద్ర, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, దివీస్‌ ల్యాబ్స్‌, ఏసియన్‌ పెయింట్స్ టాప్‌ లూజర్స్‌గా ఉ‍న్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి కూడా భారీగా లాభపడింది.   ఏకంగా 79 పైసలుఎగిసి 81.97  వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement