TodayStockMarketUpdate నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌: అదానీషేర్ల లాభాలు 

sensex and nifty in marginal losses adaniportsgains - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్​ మార్కెట్​లు  మంగళవారం  ఫ్లాట్‌గా  మొదలయ్యాయి.  ఆ  తరువాత అమ్మకాల ఒత్తిడితో ప్రస్తుతం  సెన్సెక్స్​ 80 పాయింట్లు కోల్పోయి 60,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో  17,758  వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, ఎఫ్‌ఎంసిజి షేర్లు నష్ట పోతున్నాయి. అటు అదానీ షేర్లు లాభాల్లో  కొనసాగుతుండటం విశేషం. మరోవైపు అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్  ఫలితాలు ఈ రోజు  వెలువడనున్నాయి.  

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, డా.రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు,హెచ్‌డీఎఫ్‌స టాప్‌ గెయినర్స్‌గా, టాటా స్టీల్‌, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్‌ టాప్‌ లూజర్స్‌గా కొనసాగు తున్నాయి.  అటు డాలరు మారకంలో  రూపాయి 82.75 వద్ద ఫ్లాట్‌గా ఉంది. 
 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top