Gautam Adani : గౌతమ్‌ అదానీకి భారీ షాక్‌..!

Sebi Holds Adani Wilmar Ipo Due To Investigation Against Adani Enterprises - Sakshi

ముంబై: ప్రముఖ దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం అదానీ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీకి భారీ షాక్‌ తగిలింది. అదానీ గ్రూప్స్‌కు చెందిన అదానీ విల్మార్‌ ఐపీవోకు సెబీ భారీ షాక్‌ను ఇచ్చింది. అదానీ విల్మార్‌ ఐపీవోకు అడుగులువేస్తున్న అదానీ గ్రూప్స్‌కు సెబీ అడ్డుకట్టవేసింది. ఐపీవోకు వెళ్తున్న అదానీ గ్రూప్స్‌కు చివరినిమిషంలో సెబీ షాక్‌ ఇచ్చింది.  అదానీ విల్మార్‌ ఇష్యూ విలువను  4,500 కోట్లుగా అదానీ గ్రూప్స్‌ నిర్ణయించింది.

(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!)

అదానీ గ్రూప్ కంపెనీల మేనేజ్‌మెంట్ దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలపై రెడ్ మార్క్‌ పడింది. దీంతో చాలా మంది మదుపరులకు నిరాశ ఎదురైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సుమారు 50 శాతం మేర వాటాలను అదానీ విల్మార్‌లో కలిగి ఉంది. అదానీ విల్మార్‌ కంపెనీ ఫార్చ్యూన్‌ వంటనూనెలను తయారుచేస్తోంది. అదానీ గ్రూప్స్‌ సింగపూర్‌కు చెందిన విల్మార్‌ గ్రూప్‌కు చెందిన కంపెనీతో పనిచేస్తోంది.  శుక్రవారం రోజున  అదానీ విల్మార్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లగా.. సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అడ్డుకుంది.

అదానీ గ్రూప్స్‌  ఇచ్చిన ప్రతిపాదనలను సెబీ హోల్డ్‌లో పెట్టింది. సెబీ అదానీ విల్మార్‌ ఐపీవోను హోల్డ్‌లో ఉంచడంతో 30 రోజులపాటు ఐపీవో ఇష్యూకు వెళ్లకుండా రావాల్సి ఉంటుంది. అదానీ గ్రూప్స్‌ నిబంధనల ఉల్లంఘన ఆరోపణను ఎదుర్కొంటుంది. ఈ విషయంపై సెబీ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
అదానీ గ్రూప్స్‌కు చెందిన విదేశీ పోర్ట్‌పొలీయో పెట్టుబడులపై ఇన్వెస్టిగేషన్‌ చేయనుంది. 

చదవండి: Gmail: మీకు నచ్చిన సమయానికి ఈ-మెయిల్‌ను ఇలా సెండ్‌ చేయండి...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top