ఆ కాల్స్‌తో జర జాగ్రత్త!

Scammers Targeting Amazon and Apple Customers - Sakshi

ప్రముఖ టెక్, ఈ కామర్స్ కంపెనీలైనా ఆపిల్ మరియు అమెజాన్ సంస్థలు ఇటీవల వారి వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసాయి. ఇటీవల అమెజాన్ మరియు ఆపిల్ యొక్క కస్టమర్ కేర్ విభాగం నుండి కాల్ చేస్తున్నామని.. ఆర్డర్ లేదా అకౌంట్‏లో అనుమానిత కార్యాకలపాలు జరుగుతున్నాయంటూ ఎటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వాటి నుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అందుకే ప్రతి వినియోగదారుడు తమ లాగిన్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేయకూడదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తన బ్లాగ్‏లో పోస్ట్ చేసింది. (చదవండి: ఈ యాప్స్ ని వెంటనే డిలీట్ చేయండి)

ఆపిల్ వినియోగదారుడికి ఒక తెలియని వ్యక్తి నుంచి కాల్ వస్తుంది.. మీ ఐక్లౌడ్ అకౌంట్‏లో అనుమానిత కార్యాకలపాలు జరుగుతున్నాయంటూ స్కామర్లు కాల్ చేస్తారు. తర్వాత మీ అకౌంట్ లో జరిగిన తప్పును సరిచేయడానికి ప్రతిస్పందనగా '1' డయల్ చేయండి లేదా మేము తెలిపిన నంబర్‌కు తిరిగి కాల్ చేయండి అని స్కామర్లు పేర్కొంటారు. అలాగే  అమెజాన్ తరపున వచ్చిన నకిలీ కాల్స్ అయితే, గతంలో మీరు చేసిన క్యాన్సల్ అయిన ఆర్డర్ లేదా మీరు చివరగా చేసిన డెలివరీకి సంబంధించి కాల్ చేస్తున్నామని స్కామర్లు పేర్కొంటారు. అమెజాన్ డెలివరీలు రోజు చాలా మొత్తంలో జరుగుతుండటంతో ఇటువంటి వంటి వాటికీ ఎక్కువ ఆస్కారం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. 

మీరు ఒకవేళ వీటిని నమ్మి నిజంగా కాల్ చేస్తే వారు మీ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డ్స్ వివరాలు అడుగుతారు దీని ద్వారా మీ అకౌంట్స్ హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ. అందుకే ప్రతి వినియోగదారుడు తమ లాగిన్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేయకూడదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తన బ్లాగ్‏లో పోస్ట్ చేసింది. ఇలాంటి కాల్స్ వస్తే యూజర్లు ఎలాంటి నంబర్లు క్లిక్ చేయకూడదని హెచ్చరించింది. ఇటువంటి స్కాం కాల్స్ చాలా వస్తాయని వాటికీ వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదు అని తెలిపింది. అమెజాన్ మరియు ఆపిల్ కు చెందిన సంస్థల నుండి కాల్స్ వస్తే ఒకసారి వారి పోర్టల్ లో రిజిస్టర్ చేయబడిన కస్టమర్ కేర్ నెంబర్ కాదా అనే తెలుసుకోవాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. ప్రస్తుతం ఇటువంటి మోసాలు ఎక్కువగా అమెరికాలో జరుగుతున్నాయని భారత్ లో కాదని తెలిపింది. కానీ భవిష్యత్ లో ఇలాంటి స్పామ్ కాల్స్ భారత యూజర్లు కూడా వస్తాయని తెలిపారు. అందుకోసమే వినియోగదారులు ఇంకా జాగ్రత్త వహించాలని కోరారు. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top