కీలక మైలురాయి : హోం లోన్లపై ఎస్‌బీఐ ఆఫర్లు

SBI Rs5 lakh trillion mark in home loan segment offers for custormers - Sakshi

 మార్కెట్‌ లీడర్‌గా ఎస్‌బీఐ

హోంలోన్ బిజినెస్ :  రూ. 5 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించిన బ్యాంకు 

7208933140 మిస్డ్ కాల్‌ఇస్తే.. రుణాలపై వివరాలు

సాక్షి, ముంబై:  దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ  బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో కీలక మైలురాయిని అధిగమించింది. హోంలోన్ బిజినెస్‌లో  రూ.5 ల‌క్ష‌ల కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ  సందర్భంగా  కస్టమర్లకు హోంలోన్లపై అతి త‌క్కువ వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీలాంటి ఆఫ‌ర్లను ఎస్‌బీఐ ప్రకటించింది.

 మార్కెట్‌ లీడర్‌గా ఎస్‌బీఐ హవా : కీలక మైలురాయి
రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ బిజినెస్ యూనిట్ (రెహబు) గత పదేళ్ళలో 5 రెట్లు  పుంజుకోవడం విశేషం.  కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ  భారీ వృద్ధిని నమోదు చేసింది. అలాగే 2024 క‌ల్లా దీనిని రూ.7 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది.  ఈ నేపథ్యంలో గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  ఆ దిశ‌గానే అలాగే  రోజుకు వెయ్యిమంది గృహ రుణ కస్టమర్లు సరసమైన వడ్డీరేటుకే  లోన్లను అందించనుంది. ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేసింది. కొత్త గృహ రుణ వినియోగదారుల కోసం బ్యాంక్ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. 7208933140 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా  మొత్తం  వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని ఎస్‌బీఐ వెల్ల‌డించింది.

సొంత ఇంటి కలల్ని సాకారం చేసుకోవాలనుకునే వినియోగదారులకు సరసమైన వడ్డీరేటులో రుణాలను అందుబాటులోకి తీసుకు రావడానికి  నిరంతర ప్రయత్నం చేస్తున్నామని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా అన్నారు. ఈ కృషిలో భాగంగానే  5 లక్షల కోట్లు మార్క్‌ తమకు గొప్ప విజయం, తమపై వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమన్నారు. మార్కెట్ లీడర్‌గా తమ స్థానాన్ని నిలబెట్టు కోవడం సంతోషంగా ఉందన్నారు. గృహ రుణ పంపిణీలో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు బ్యాంక్ వివిధ డిజిటల్ కార్యక్రమాలపై కృషి  చేస్తూ, ఎండ్-టు-ఎండ్ డిజిటల్పరిష్కారాన్ని అందించేలా ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫాం రిటైల్ లోన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఆర్‌ఎల్‌ఎంఎస్) లాంచ్‌ చేశామన్నారు.  రెగ్యులర్ హోమ్ లోన్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్, ఆర్మీ అండ్‌  డిఫెన్స్ సిబ్బందికి ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్, ఎస్బిఐ మాక్స్ గెయిన్ హోమ్ లోన్, ఎస్బిఐ స్మార్ట్ హోమ్, ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం టాప్‌ అప్ లోన్, ఎస్బిఐ ఎన్ఆర్ఐ హోమ్ లోన్, ఎస్బిఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్,  మహిళల కోసం హెర్‌ఘర్‌ హోం లోన్ లాంటి రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఏడాదికి క‌నిష్ఠంగా 6.8 శాతం వ‌డ్డీతో రుణాలతో ఈ విభాగంలో 34 శాతం మార్కెట్ వాటాను సాధించామన్నారు.

కాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎమ్‌వై) సబ్సిడీని అందించేందుకు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సిఎన్‌ఎ)గా గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన ఏకైక బ్యాంకు ఎస్‌బీఐ.  ‘2022 నాటికి అందరికీ హౌసింగ్’   అనే ప్రభుత్వ  కార్యక్రమానికి మద్దతుగా, పీఎంవై కింద గృహ రుణాలను అందిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2020 నాటికి 1,94,582 గృహ రుణాలను మంజూరు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top