గిఫ్ట్‌ సిటీ బ్రాంచ్‌ ద్వారా ఎస్‌బీఐకి రూ.3,800 కోట్లు

Sbi Raises USD 500 Million Through Ifsc Gift City Branch - Sakshi

ముంబై: బ్యాంకింగ్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ తాజాగా ఐఎఫ్‌ఎస్‌సీ గిఫ్ట్‌ సిటీ బ్రాంచీ ద్వారా 50 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)ను సమీకరించింది. గిఫ్ట్‌ సిటీ బ్రాంచ్‌ ద్వారా తొలిసారి ఆఫ్‌షోర్‌ యూఎస్‌ డాలరు సెక్యూర్డ్‌ ఓవర్‌నైట్‌ ఫైనాన్సింగ్‌ రేటు(ఎస్‌వోఎఫ్‌ఆర్‌) ఆధారిత సిండికేట్‌ రుణాన్ని అందుకున్నట్లు స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) పేర్కొంది.

40 కోట్ల డాలర్ల విలువైన ఈ రుణ సౌకర్యంతోపాటు గ్రీన్‌షూ ఆప్షన్‌కింద మరో 10 కోట్ల డాలర్లను సైతం సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. ఆఫ్‌షోర్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లలో బ్యాంకు సృష్టించుకున్న గుర్తింపునకు తాజా రుణ సమీకరణ నిదర్శనమని ఎస్‌బీఐ తెలియజేసింది.

అంతేకాకుండా ఐఎఫ్‌ఎస్‌సీ గిఫ్ట్‌ సిటీని అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో బ్యాంకుకున్న కట్టుబాటుకు ఇది మరో ముందడుగుగా అభివర్ణించింది.  ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5 శాతం నీరసించి రూ. 510 వద్ద ముగిసింది.   

చదవండి: ఎస్‌బీఐ షాకింగ్‌ నిర్ణయం..వారిపై తీవ్ర ప్రభావం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top