Satyam Scam:హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు

Satyam Scam HDFC chairman comments on chartered accountants - Sakshi

న్యూఢిల్లీ: సత్యం స్కామ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్‌ పుస్తకాలను ఆడిట్‌ చేసిన చార్టర్డ్‌ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లు అందరూ అప్పటి చైర్మన్‌ బి.రామలింగరాజుకు రబ్బర్‌ స్టాంప్‌ మాదిరిగా పనిచేసినట్టు విమర్శించారు. 2009 జనవరిలో రూ.7,800 కోట్ల రూపాయల సత్యం స్కామ్‌ వెలుగులోకి రావడం తెలిసిందే. (బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్)

అనంతరం జరిగిన పరిణామాల్లో సత్యంను టెక్‌ మహీంద్రా సొంతం చేసుకుని, తనలో విలీనం చేసుకుంది. చాలా ఏళ్లపాటు లేని లాభాలను చూపిస్తూ వచ్చినట్టు రామలింగరాజు స్వయంగా అంగీకరించారు. ఏ కంపెనీ సీఈవో అయినా వాటాదారుల కోసం పనిచేస్తున్నట్టు అర్థం చేసుకోవాలని పరేఖ్‌ సూచించారు. విఫలమవుతున్న కంపెనీల సంఖ్య పెరుగుతోందంటూ, కొందరి అత్యాశ కారణంగా ప్రజలు డబ్బును, విశ్వాసాన్ని కోల్పోతున్నట్టు చెప్పారు. (కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం)

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా స్పందిస్తూ.. నాటి సత్యం కంప్యూటర్‌ స్కామ్‌ సమయంలో బోర్డును ప్రభుత్వం రద్దు చేసి, ప్రైవేటు రంగంలో నిపుణులతో భర్తీ చేసినట్టు చెప్పారు. నాడు నిపుణులతో ఏర్పాటు చేసిన సత్యం బోర్డులో పరేఖ్‌కు సైతం స్థానం కల్పించడం గమనార్హం.    (Amazon Layoffs అమెజాన్‌ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్‌!)

ఇదీ చదవండి: ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్‌ పీ 150: ధర ఎంతంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top