 
													Sanjay Bhargava To Join Musk Starlink As India Country Director: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవల్ని భారత్‌కు విస్తరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే భారత టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి స్టార్‌లింక్ అనుమతులను కూడా ప్రయత్నించిన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవను స్పేస్‌ఎక్స్ నియమించింది.  
చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..!
పేపల్ నుంచి...
అక్టోబర్ 1 నుంచి స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవ పనిచేయనున్నారు. సంజయ్ భార్గవ తన లింక్డ్ ఇన్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశారు. గతంతో పేపల్ ఫిన్‌టెక్ సంస్థలో సంజయ్ పనిచేశారు. అంతేకాకుండా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ భరోసా క్లబ్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. స్టార్‌లింక్ సేవలు త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సంజయ్ భార్గవ వెల్లడించారు. భారత్‌లో టెలికాం రెగ్యూలేటరీ ట్రాయ్ నుంచి త్వరలోనే ఆమోదం వస్తోందని సంజయ్ అభిప్రాయపడ్డారు. 
చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్‌మీ వాషింగ్‌మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
