Samsung Galaxy S21, S21 Plus Specifications, Features, Release Date In India - Sakshi
Sakshi News home page

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లో హలచల్ చేస్తున్న గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్

Dec 28 2020 3:43 PM | Updated on Dec 28 2020 7:46 PM

 Samsung Galaxy S21, S21 Plus Full Specifications Leaked - Sakshi

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ స్పెసిఫికేషన్లు అధికారికంగా ప్రారంభించడానికి ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. 2021 జనవరి ప్రారంభంలో ఈ మొబైల్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం.  తాజాగా జర్మనీకి చెందిన విన్ ఫ్యూచర్.డి పబ్లిషర్ తన బ్లాగ్ లో గెలాక్సీ ఎస్ 21 స్పెసిఫికేషన్లను లీక్ చేసింది. విడుదలైన లీక్స్ ప్రకారం, గెలాక్సీ ఎస్ 21లో ట్రీపుల్ రియర్ కెమెరా సెటప్, సింగిల్ సెల్ఫీ షూటర్ కెమెరా, 8 జీబీ ర్యామ్ తో రానుంది. ఈ మొబైల్స్ లో ప్రాంతాన్ని బట్టి శామ్‌సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో తీసుకురానున్నారు.(చదవండి: యాపిల్ బాటలో షియోమీ)

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫీచర్స్: 
విన్ ఫ్యూచర్.డి పేర్కొన్న వివరాల ప్రకారం.. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ డ్యూయల్ సిమ్(నానో) సపోర్ట్ తో రానుంది. ఈ మొబైల్స్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1పై పని చేయనున్నాయి. ఈ మొబైల్స్ ప్రాంతాన్ని బట్టి శామ్‌సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానుంది. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 + 8 జీబీ ర్యామ్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉండగా 128 జీబీ, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21లో 6.2-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్(1,080x2,400 పిక్సెల్స్) డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ స్క్రీన్, ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతో రానున్నట్లు పేర్కొంది. అలాగే, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ కూడా అదే డిస్‌ప్లేతో 6.7-అంగుళాల పరిమాణంలో, 394 పిపి పిక్సెల్ సాంద్రతతో రానుంది. రెండు ఫోన్‌లలో 60-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో రానునట్లు భావిస్తున్నారు. 

గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంటాయి. ఇందులో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో ఎఫ్/2.0 లెన్స్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.2 కెమెరా, వైడ్ యాంగిల్ ఎఫ్/1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ మొబైల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 3x “హైబ్రిడ్” ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉండనున్నాయి. బ్యాటరీ పరంగా, గెలాక్సీ ఎస్ 21 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికి సపోర్ట్ చేయనుంది. కనెక్టివీటి కోసం బ్లూటూత్ వీ5, యుఎస్బీ టైప్ సి పోర్ట్, ఎన్ఎఫ్సి, వై-ఫై 6 ఉన్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ధర:
గత వారం విన్ ఫ్యూచర్.డి శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ యొక్క ధరలను నివేదించింది. గెలాక్సీ ఎస్ 21 బేస్ మోడల్ 128జీబీ ధర యూరో 849 (సుమారు రూ.76,000), 256జీబీ మోడల్ యూరో 899 (సుమారు రూ.80,600)కు లభించనున్నట్లు సమాచారం. మరోవైపు గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ల ధరలు వరుసగా యూరో 1,049 (సుమారు రూ.94,000), యూరో 1,099 (సుమారు రూ.98,700) వద్ద లభిస్తుందని అంచనా. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ రెండూ జనవరి 14న రాబోయే గెలాక్సీ ఎస్ 21 అల్ట్రాతో పాటు ప్రారంభించనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement