V Krishnamurthy: సెయిల్‌ మాజీ ఛైర్మన్‌ వీ.కృష్ణమూర్తి కన్నుమూత

Sail Former Chairman V Krishnamurthy Died In Chennai - Sakshi

బిజినెస్‌ వరల్డ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాజీ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సెయిల్), మారుతి సుజుకి చైర్మన్‌ వీ.కృష్ణమూర్తి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో వి.కృష్ణమూర్తి మరణించినట్లు సెయిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

కృష్ణమూర్తి సెయిల్‌లో 1985 నుంచి 1990 వరకు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. "పద్మ విభూషణ్‌ డాక్టర్‌. వెంకట రామన్‌ కృష్ణమూర్తి మరణం పట్ల సెయిల్ కుటుంబం తీవ్ర సంతాపం వ్యక్తం చేస‍్తుందంటూ" సెయిల్‌ విడుదల చేసిన ప్రటకనలో పేర్కొంది. 

ఆయన సేవలు మరువలేం!
వెంకట రామన్‌ కృష్ణమూర్తి  సెయిల్‌, బీహెచ్‌ఈఎల్‌ వంటి దిగ్గజ సంస్థలకు చైర్మన్‌గా వ్యవరించారు. వీటితో పాటు మారుతి ఉద్యోగ్‌(మారుతి సుజుకి), గెయిల్‌లో చైర్మన్‌గా ముఖ్య పాత్ర పోషించారు. కృష్ణ మూర్తి మరణంపై మారుతి సుజుకి చైర్మన్‌ ఆర్‌సీ. బార్గవ విచారం వ్యక్తం చేశారు. అవుట్‌ స్టాండింగ్‌ లీడర్‌, గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి. ఆయన సారధ్యంలోనే మారుతి ఉద్యోగ్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. భారత్‌లో జపనీస్‌ వర్క్‌ కల్చర్‌ను పరిచయం చేసింది కృష్ణమూర్తేనని గుర్తు చేశారు. వ్యక్తి గతంగా సివిల్‌ సర్వీస్‌ నుంచి ఇండస్ట్రీలిస్ట్‌గా ఎదగడానికి కృష్ణమూర్తి ఎంతో తోడ్పడ్డారని చెప్పారు.  

కృష్ణమూర్తి గొప్ప దార్శానికుడు. నా గురువుగా..టీవీఎస్‌ మోటార్‌ను ఒక సామ్రాజ్యంగా విస్తరించడంలో చేసిన కృషి చిరస్మరణీయం. అంతేకాదు వ్యాపార రంగంలో దేశ ఎకానమీ వృద్ది కోసం పాటు పడిన వారిలో కృష్ణమూర్తి ఒకరని టీవీఎస్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ కొనియాడారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top