ఎయిర్ ఇండియా సీఈఓను వెంటనే తొలిగించాలి: ఆర్ఎస్ఎస్

RSS urges govt to reject the appointment of new Air India CEO - Sakshi

గత కొద్ది రోజుల క్రితం ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ టాటా సన్స్‌ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్‌లో కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. టర్కీలో తన మునుపటి రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్రాన్ని కోరింది.

ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్'గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఉన్న ఇల్కర్ ఐసీని తన బ్యాగ్ గ్రౌండ్ చెకింగ్ క్షుణ్ణంగా దర్యాప్తు చేయలని ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని కోరింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఐసీ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల 2.4 బిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న విమానయాన సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా సీఈఓగా ఐసీని నియమించింది. ఆర్ఎస్ఎస్ ప్రకటనపై టాటా గ్రూప్ కూడా స్పందించలేదు. స్వదేశీ జాగరణ్ మంచ్ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ మాట్లాడుతూ.. టర్కీ భారత ప్రత్యర్థి పాకిస్తాన్ పట్ల సానుభూతితో ఉన్నందున ఐసీ నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించరాదని అన్నారు. భారతదేశంలో ఒక విమానయాన సంస్థకు సీఈఓగా విదేశీ జాతీయుడి నియమించడానికి ముందు ప్రభుత్వ క్లియరెన్స్ అవసరం అని ఆయన అన్నారు. 

(చదవండి: ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top