తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత | Sakshi
Sakshi News home page

Mukesh Amban: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత

Published Fri, Sep 16 2022 2:12 PM

RIL Chairman Mukesh Ambani on Friday visited and offered prayers to Lord Venkateshwara at Tirumala - Sakshi

తిరుపతి: పారిశ్రామికవేత్త రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి అంబానీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీస్సులు అందుకున్న అంబానీ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని సందర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల దేవస్థానం ఏటా అభివృద్ధి చెందుతోందని కొని యాడారు. దేశ ప్రజలందరినీ ఆశీర్వదించాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు అంబానీ.ఈ పర్యటనలో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి వచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement