రెనాల్ట్ ట్రైబర్ ఇండియా ధరల వాత

Renault Triber India Prices Hiked By Up To 13000  - Sakshi

పాపులర్ ఎంపీవీ ట్రైబర్ ధరలను పెంచిన రెనాల్ట్

11,500- 13 వేల వరకు 

సాక్షి, ముంబై:  రెనాల్ట్ ఇండియా తన పాపులర్ ఎంపీవీ ట్రైబర్ ధరలను  పెంచేసింది. గత ఏడాది ఆగస్టులో భారత  మార్కెట్ లో రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ చేసింది. ఆ తరువాత కొత్త నిబంధనలకు అనుగుణంగా  అప్ డేట్   చేసి  బీఎస్-6  వేరియంట్  ట్రైబర్‌ను 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఈ ఏడాది జనవరిలో  తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 29 వేల రూపాయల మేర ధర పెంచింది. తాజాగా మరోసారి పెంపుతో 11,500 నుండి 13,000 మేర వినియోగదారులపై భారం మోపనుంది.  దేశంలో  రెనాల్ట్ ట్రైబర్  ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ఈ కారును లాంచ్ చేసినప్పటినుంచి  ఇప్పటికి నాలుగు సార్లు  ధర పెంచడం గమనార్హం. 

ప్రధానంగా ఆర్‌ఎక్స్‌ఈ  మోడల్ ధరను 13 వేల రూపాయలు పెంచింది. దీంతో దీని ధర ఇప్పుడు  5.12 లక్షలుగా ఉంది.  అలాగే 12,500 పెంపుతో ఆర్ఎక్స్ జెడ్, ఆఎక్స్ జెడ్ ఏఏంటీ  వేరియంట్‌ ధరలు 6.94 లక్షలు, 7.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) రూపాయలు. రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ సింగిల్ పవర్‌ ట్రెయిన్ ఆప్షన్‌తో వస్తుంది. 1.0 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్,  5 స్పీడ్ ఏఎంటీ, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top