జియో : 10 కోట్ల లోకాస్ట్ స్మార్ట్‌ ఫోన్‌లు

Reliance Jio to roll out 10 crore low cost phones by December - Sakshi

డిసెంబరు చివరికి లేదా, 2021 మొదటి నాటికి 10 కోట్ల  స్మార్ట్‌ఫోన్లు

సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలకనుంది. భారీ ఎత్తున లోకాస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లోగూగుల్ ఆండ్రాయిడ్  ద్వారా తక్కువ రేటుతో కూడిన 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల తయారు చేయనుంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌లలో డేటాప్యాక్ లను కూడా అందించాలని భావిస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం డేటా ప్యాక్‌లతో కూడిన100 మిలియన్లకు పైగా ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుంది. జియో కోసం "4 జీ లేదా 5 జీ" స్మార్ట్‌ఫోన్‌లకోసం గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను నిర్మిస్తోందని ఇటీవల రిలయన్స్‌ అధినేత బిలియనీర్ ముకేశ్ అంబానీ ప్రకటించడం గమనార్హం. (రిలయన్స్ రిటైల్‌లో: కేకేఆర్ భారీ పెట్టుబడి)

తద్వారా దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ముకేశ్‌ అంబానీ సారధ్యంలోని జియో స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలోతన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది. కాగా ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ తన డిజిటల్ యూనిట్లో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో రిలయన్స్ ప్రకటించింది.  జియో ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 33 శాతం  వాటా విక్రయం ద్వారా 1.52 ట్రిలియన్ డాలర్లు (20.22 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులను సాధించింది. ఫేస్‌బుక్, ఇంటెల్, క్వాల్కమ్‌లతో సహా ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top