దూసుకెళ్తున్న రిలయెన్స్‌ ఇండస్ట్రీస్.. | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న రిలయెన్స్‌ ఇండస్ట్రీస్..

Published Thu, Jul 30 2020 10:11 PM

Reliance Industries Profit Increases In Many Sectors - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని వినియోగదారులను ఆకర్శిస్తు రిలయన్స్ ఇండస్ట్రీస్  దూసుకెళ్తుంది. 2020-21 జూన్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 183 శాతం పెరిగి రూ. 2,520 కోట్లుగా నమోదైంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ వృద్ధి చెందినట్లు తెలిపింది. కాగా  జూన్‌ 2019నెలలో ప్రకటించిన లాభాలతో పోలిస్తే 2020జూన్‌ నికర లాభాలలో 31శాతం పెరిగినట్లు గురువారం రిలయెన్స్‌ ప్రకటించింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 33.7 శాతం వృద్ధి చెంది రూ.16,557 కోట్లు అర్జించింది. కాగా 2020 జూన్ 30 నాటికి జియో వినియోగదారుల సంఖ్య 39.83 కోట్లకు చేరుకొని ఆకర్శిస్తుంది. కాగా పెట్రోలియమ్‌ ఉత్పత్తులతో అదరగొడుతున్న జియో సంస్థలో రూ.212,809కోట్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది.

మరోవైపు ఫేస్‌బుక్, గూగుల్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబడాలా, ఎడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్టన్, పీఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్‌తో సహా ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్శించిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద సేవా ఫౌండేషన్ మిషన్ అన్నా సేవను ప్రారంభించి లక్షలాది పీపీఈ కిట్టుల, మాస్క్‌లను అందించింది. దేశంలోనే మొదటి కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించింది. ముంబైలో సహాయ నిధుల కోసం రూ.6 556 కోట్లు విరాళం ప్రకటించింది. ముఖ్యంగా పెట్రోలియమ్‌ ఉత్పత్తుల పరంగా లాక్‌డౌన్‌ సమయంలోను 90శాతం ఉత్పత్తితో రిలయెన్స్‌ ఇండసస్టట్రీస్‌ సత్తా చాటిందని సంస్థ పేర్కొంది.

Advertisement
Advertisement