Digital Discount Days 2022: అదిరిపోయే ఆఫర్లతో రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌!

Reliance Digital Announces Digital Discount Days Sale - Sakshi

Reliance Digital Discount Days Sale, ముంబై: రిలయన్స్‌ డిజిటల్‌ ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు ‘‘డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌ సేల్‌’’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై బెస్ట్‌ డీల్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులపై 7.5% వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది. అదనంగా రూ.రెండు వేల విలువైన కూపన్స్‌ ఇస్తారు. రూ.80 వేల కంటే ఎక్కువ కొంటే రూ.10 వేల వరకు అదనపు డిస్కౌంట్‌ ఇస్తారు.

 టీవీలు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, స్మార్ట్‌ వాచీలు, కిచెన్‌ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్‌ ఉన్నాయి. ఈఎంఐ పద్ధతిలోనూ ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చు. సరికొత్త శామ్‌సంగ్‌గెలాక్సీ ఎస్‌22+ గ్రీన్‌ కలర్‌ వేరియంట్‌ ప్రత్యేకంగా రిలయన్స్‌ డిజిటల్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 84,999గా ఉంది. 

ఈ ఆఫర్‌ కింద ఐఫోన్‌ 13 సరసమైన ధర(ప్రారంభ ధర రూ.61,900)కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్‌లు, డిస్కౌంట్లు రిలయన్స్‌ డిజిటల్, జియో సోర్ట్స్‌లతో పాటు  www. reliancedigital. in లేదా  www. jiomart. com  వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top