మీ స్మార్ట్‌ఫోన్‌ పాడైందా? అయితే ప్రధాన కారణం ఇదే!

Reasons For Smartphone Repair And Decreasing Battery Life - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్‌ల వాడకం కూడా అదే స్థాయిలో ఉంది. ఇటీవల వేల ఖర్చు పెట్టి కొన్న స్మార్ట్‌ఫోన్లు త్వరగా పాడైపోయిన ఘటనలు మన చుట్టు పక్కలనో లేదా స్నేహితులు, బంధువుల దగ్గరో చూసే ఉంటాం. దీనికి కారణాలు చాలానే ఉన్నా ప్రధానంగా ఉన్నది మాత్రం ఫోన్ బ్యాటరీ పాడైపోవడం. ఈ బ్యాటరీ సమస్య మాత్రం మొబైల్‌ కంపెనీలకు సవాలుగా మారింది. మనం తెలియకుండా చేసే పనులే మన ఫోన్‌ని రిపేర్‌ షాపులో ఉండేలా చేస్తున్నాయి. అవేంటో చూసేద్దాం!

రకరకాల ఛార్జర్లను ఉపయోగించడం
మొదట్లో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి కంపెనీ చార్జర్‌ వాడుతాం. కానీ కొన్ని రోజులకే వేరే వాటిని ఉపయోగిస్తాం. దీనివల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై దుష్ప్రభావం పడుతుంది. పైగా చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం. కంపెనీ చార్జర్‌ని పక్కన పెడితే అది ఫోన్‌ బ్యాటరీని లైఫ్‌టైంని ఇది తగ్గిస్తుంది. ఎలా అంటారా శాంసంగ్‌(Samsung) స్మార్ట్‌ఫోన్‌లు 18W లేదా 25W ఛార్జింగ్‌ను కలిగి ఉంటాయి. అలానే రియల్మీ( Realme ) స్మార్ట్‌ఫోన్‌లో 18W, 33W, 67W సాధారణ ఛార్జింగ్ ఉంటుంది. 

ఫుల్‌ చార్జ్‌ అవసరం లేదు
చాలా సార్లు స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్‌లోనే ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగితే, అది మీ ఫోన్ ప్రాసెసర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అంటే బ్యాటరీతో పాటు ఫోన్ ప్రాసెసర్ కూడా దెబ్బతింటుంది. అందుకే 90 శాతం ఛార్జింగ్‌ చేస్తే సరిపోతుంది.

జీరో స్థాయి చార్జ్‌ మంచి కాదు
ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం. అలాగే వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం మంచిదికాదు.

తరచుగా ఛార్జింగ్ పెట్టకూడదు
ఫోన్‌ని ఛార్జింగ్‌లో ఉంచిన తర్వాత 90 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే కొంత మంది ఏదో హడావుడిలో పడి 40, 50 ఇలా తక్కు శాతం చార్జ్‌ అవగానే వాడుతుంటారు. అంతలోనే ఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోందని మళ్లీ చార్జ్‌ చేస్తుంటారు. ఈ ప్రక్రియనే మళ్లీ మళ్లీ పాటిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, బ్యాటరీ మాత్రమే కాదు ఫోన్‌ లైఫ్‌టైం కూడా తగ్గిపోతుంది. పదే పదే ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కెపాసిటీ నిరంతరం తగ్గుతూ ఉంటుంది.

చదవండి: Edible Oil Prices: బిగ్‌ రిలీఫ్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top