రూ.13వేలకే రియల్‌మీ ఎక్స్7 ప్రో | Realme X7 Pro 5G Comes Below Rs 13000 With Exchange Discount | Sakshi
Sakshi News home page

రూ.13వేలకే రియల్‌మీ ఎక్స్7 ప్రో

Feb 18 2021 7:57 PM | Updated on Feb 18 2021 8:26 PM

చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ ఇటీవలే ప్రీమియం రియల్‌మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ను భారత్ లో విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే. రియల్‌మీ నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. కొద్దీ రోజుల క్రితం ఫస్ట్ సేల్ కి వచ్చిన అవుట్ అఫ్ స్టాక్ వెళ్లింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఎక్స్‌ఛేంజ్‌ కింద రూ.30వేలు విలువైన రియల్‌మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సగం ధరకే కొనవచ్చు. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.16,500 తగ్గిస్తే మీరు చెల్లించాల్సింది రూ.13,499 మాత్రమే. 

మీ దగ్గర యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా 7 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.13,499 ధరపై 5 శాతం అంటే రూ.674 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ లెక్కన మీకు రియల్‌మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.13,000 లోపే కొనవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ బట్టి ఎక్స్‌ఛేంజ్ రేటు మారే అవకాశం ఉంది. అందుకే కొనే ముందు ఒకసారి మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్ ఎంత వస్తుందో ఓసారి చెక్ చేసుకోండి.

చదవండి:

ఎస్‌బీఐ వినియోగదారులకి హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement