ఫీచర్స్‌​ లీకయ్యాయి, ఆపిల్‌ తరహాలో | Realme Pad camera and battery specifications leaked | Sakshi
Sakshi News home page

ఫీచర్స్‌​ లీకయ్యాయి, ఆపిల్‌ తరహాలో

Jul 30 2021 11:29 AM | Updated on Jul 30 2021 11:43 AM

Realme Pad camera and battery specifications leaked  - Sakshi

టెక్‌ యుగంలో గాడ్జెట్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. దైనందిన జీవితంలో భాగమైన గాడ్జెట్స్‌ను విడుదల చేసేందుకు ఆయా స్మార్ట్‌ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా  చైనా సంస్థ రియల్‌ మీ టాబ్లెట్‌, రియల్‌ మీ ప‍్యాడ్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాదిలోపే విడుదల కానున్న ఈ గాడ్జెట్స్‌ ధర ఎంతో కన్ఫామ్‌ కాకపోయినప‍్పటికి వాటి ఫీచర్స్‌ లీకయ్యాయి.   

ఫీచర్స్‌ ఇలా ఉన్నాయి

టిప్‌స్టెర్‌ కథన ప్రకారం రియల్‌మీ ప్యాడ్‌ 7000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తుంది. ప్రస్తుతం 65 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కావాలంటే 45000ఏంఎంహెచ్‌ బ్యాటరీ తప‍్పనిసరిగా ఉండాలి.లుక్‌ వైజ్‌గా చూసుకుంటే రియల్‌మీ ప్యాడ్.. ఆపిల్ ఐప్యాడ్‌ను పోలి ఉంటుందని తేలింది. ఎందుకంటే అన్నీ వైపులా మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉంది.  ప్యాడ్ వెనుక భాగంలో కేవలం ఒక కెమెరాను కలిగి ఉండడం మరో విశేషం. రెండర్లు బెజెల్స్‌ సన్నగా ఉండి బటన్ డిజైన్ తక్కువగా ఉంది.  

యూరోపియన్ మార్కెట్ కోసం తహతహలాడుతున్న రియల్‌ మీ ఈ ఏడాది జిటి 5జి లాంచ్ ఈవెంట్‌లో రియల్‌మీ ప్యాడ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. టాబ్లెట్ మాత్రమే కాదు రియల్‌మీ బుక్‌ అని పిలిచే ల్యాప్‌ ట్యాప్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి ఫీచర్స్‌ ఇలా ఉన‍్నా త్వరలో దాని ధరెంతో తెలిసే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement