Realme C33 2023: తక్కువ ధరలో రియల్‌మీ ఫోన్లు... కిర్రాక్‌ ఫీచర్లు!

realme c33 2023 edition smartphone launched - Sakshi

రియల్‌మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని విస్తరించింది. తాజాగా భారత్‌లో రియల్‌మీ C33 2023 ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఇంతకు ముందు వచ్చిన రియల్‌మీ C33కి ఇది మెరుగైన వెర్షన్. HD+ డిస్‌ప్లే, Unisoc చిప్‌సెట్‌ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్‌? భారీగా పతనమైన షేర్లు..

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వెర్షన్‌లలో లభిస్తుంది. ఒకటి 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్,  మరొకటి 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌. వీటిలో మొదటి వర్షన్‌ ధర రూ. 9,999 కాగా మరొకటి రూ.10,499. ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్లలో లభిస్తాయి. రియల్‌మీ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు . రియల్‌మీ C35 ఫోన్ విడుదలను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది దేశంలో మార్చి 21 న విడుదల కానుంది.

రియల్‌మీ C33 2023 స్పెసిఫికేషన్లు

  • 6.5 అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌
  • ఆక్టాకోర్‌ (octa-core) Unisoc T612 ప్రాసెసర్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ప్రాథమిక సెన్సార్ 50 ఎంపీ లెన్స్,  సెకండరీ AI సెన్సార్‌, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
  • 10 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top