మూత పడనున్న మరో బ్యాంక్‌? భారీగా పతనమైన షేర్లు..

First Republic Bank to shut down Bank shares dip nearly 70pc - Sakshi

అమెరికా సిలికాన్‌ బ్యాంక్‌ దివాలా తర్వాత అమెరికాకు చెందిన మరో బ్యాంక్‌ మూతవేత దిశగా పయనిస్తోంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్‌తోపాటు మరో ఐదు బ్యాంకింగ్‌ సంస్థలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ డౌన్‌గ్రేడ్ కోసం పరిశీలనలో ఉంచింది.

ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు ఆదివారం (మార్చి12న) ఓపెనింగ్‌లో రికార్డు స్థాయిలో 67 శాతం పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్‌ కోతో సహా ఒప్పందాల కార్యకలాపాల  నిర్వహణ కోసం 70 బిలియన్‌ డాలర్లకుపైగా అన్‌ఓపెన్డ్‌ లిక్విడిటీని కలిగి ఉన్నట్లు బ్యాంక్‌ ప్రకటించినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద బ్యాంకింగ్ సంస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. 

మూడీస్ పరిశీలనలో ఉంచిన బ్యాంకుల్లో ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌తో పాటు వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యూఎంబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్, జియన్స్ బాన్‌కార్ప్, కొమెరికా ఇంక్ సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్‌ సంస్థలు బీమా చేయని నిధుల లిక్విడిటీపై ఆధారపడటం, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో అవాస్తవిక నష్టాలపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..  ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం పడిపోయింది. ఇంతకుముందు ట్రేడింగ్ రోజున దీని విలువ ఒక్కో షేరుకు 19 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి చేరుకునే ముందు ఇలాంటి సంకేతాలకే ఇచ్చాయి. ట్రేడింగ్ నిలిపేసే ముందు ప్యాక్‌వెస్ట్ బ్యాంక్ షేర్లు 82 శాతం క్షీణించాయని, వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్ సంస్థ షేర్లు సగానికి పైగా పడిపోయాయని వియాన్ అనే సంస్థ నివేదించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top