వడ్డీరేట్లపై తేల్చి చెప్పిన ఆర్‌బీఐ! | Sakshi
Sakshi News home page

వడ్డీరేట్లపై తేల్చి చెప్పిన ఆర్‌బీఐ!

Published Sat, Jan 20 2024 2:17 PM

RBI Quashes Hopes Of Early Rate Cut - Sakshi

వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఆలోచనేమీ లేదని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే రూమర్స్‌‌పై ఆయన స్పందించారు. ద్రవ్యోల్బణంను 4 శాతం దిగువకు తీసుకురావడంపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. రేట్ల తగ్గింపుపై చర్చ కూడా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు.

రష్యా-ఉక్రెయిన్‌‌ యుద్ధం సమయంలో భారత్‌లో  ద్రవ్యోల్బణం 7.8 శాతానికి పెరిగిందన్నారు. క్రమంగా దాన్ని తగ్గించేందుకు నిత్యం ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎలాగైనా ఇన్‌ఫ్లోషన్‌ను 4 శాతం దిగువకు తీసుకువచ్చేలా పనిచేస్తున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5గా నమోదుకావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2024-25లో ద్రవ్యోల్బణం కొంత ఒడుదొడుకులకు లోనవుతుందని అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఏడాదిలో (2024-25)లో 7 శాతం వృద్ధిరేటును నమోదుచేసే అవకాశం ఉందని తెలిపారు. 

ఇదీ చదవండి: రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్‌ నిల్వలు

ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థకు మధ్య, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రతికూల అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనదేశ వృద్ధి మెరుగ్గా ఉందని, స్థిరత్వం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement