RBI Repo Rates:రెపోరేట్లను పెంచనున్న ఆర్బీఐ, భారం కానున్న ఈఎంఐలు

Rbi Likely To Raise The Repo Rate Between 35-50 Bps In September - Sakshi

Repo Rate Hike In September Policy: త్వరలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) తీసుకోనున్న నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్లను పెంచనున్నట్లు సమాచారం. 

రిటైల్ కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరగనుంది. ఎంపీసీ సమావేశంలో ఐదు నెలల పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ రెపొ రేట్లు 35 - 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

రెపో రేటు అంటే ఏమిటి?
ఆర్బీఐ..కమర్షియల్‌ బ్యాంకులకు వడ్డీకి రుణాలు ఇస్తుంది. ఆ రుణాల్ని రెపో రేటు అని పిలుస్తారు. ఆ రెపో రేట్లు పెరగడం వల్ల  బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే పర్సనల్‌, హోం లోన్‌, వెహికల్‌ లోన్ల వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో కస్టమర్లు బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ భారం పెరగుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top