RBI Launches UPI123Pay That Allows UPI Payments on Feature Phones - Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందించిన ఆర్బీఐ..!

Published Tue, Mar 8 2022 2:46 PM

RBI Launches UPI123Pay That Allows UPI Payments On Feature Phones - Sakshi

బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శుభవార్తను అందించింది. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ఫీచర్స్‌ ఫోన్ల నుంచి యూపీఐ సేవలను పొందే వెసులబాటును సదరు ఖాతాదారులకు ఆర్బీఐ తీసుకొచ్చింది. దాంతో పాటుగా డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించి కొత్త హెల్స్‌లైన్‌ను  ఏర్పాటు చేసింది.  దీంతో బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా పొందవచ్చును. 

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ఫీచర్‌ ఫోన్ కోసం యూపీఐ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సర్వీసును యూపీఐ123పే(UPI123Pay) పేరుతో లాంచ్‌ చేశారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 24 గంటల హెల్ప్ లైన్ డిజిసాథి(DigiSaathi) సర్వీసును ఆవిష్కరించారు.14431 లేదా 1800 891 3333 నెంబర్ల ద్వారా డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించిన సేవలను పొందవచ్చును. ఈ సర్వీసు 40 కోట్ల భారతీయులకు ఉపయోగపడుతుందని ఆర్బీఐ పేర్కొంది. 

గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ సేవలను లాంచ్‌ చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ సేవల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈ సేవలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పునకు సాక్షంగా నిలుస్తుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. 

ఇవి మాత్రమే అందుబాటులో..!
యూపీఐ123పే ద్వారా సదరు ఫీచర్ ఫోన్ బ్యాంకు ఖాతాదారులు దాదాపు అన్ని రకాల యూపీఐ సేవలు పొందవచ్చును.  కాగా స్కాన్ అండ్ పే సర్వీసులు మాత్రం అందుబాటులో ఉండవు. ఆయా లావాదేవీలను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చేయవచ్చును. ఈ ఫీచర్‌ను పొందడానికి సదరు బ్యాంకు ఖాతాదారులు వారి బ్యాంక్ అకౌంట్‌ను ఫీచర్ ఫోన్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

నగదు ట్రాన్స్‌ఫర్‌ ఇలా చేయండి

  • ఫీచర్‌ ఫోన్‌లో *99# అని టైప్ చేసి డయల్‌ చేయాలి. 
  • ఇప్పుడుMy Profile', 'Send Money', 'Receive Money', 'Pending Requests', 'Check Balance', 'UPI PIN', 'Transactions' అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
  • డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్‌లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  • ఇప్పుడు మీరు మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. 
  • ఈ పేమెంట్స్ మెథడ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. 
  • ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఒకవేళ మీరు యుపీఐని ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు యుపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. 
  • బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 
  • ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి. 
  • ఆ తర్వాత మీ యూపీఐ పిన్ నమోదు చేసి send పైన క్లిక్ చేయాలి. 
  • ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తాయి. 

గమనిక: ఈ ఫీచర్‌ను పొందాలంటే సదరు మొబైల్‌ నంబర్‌తో బ్యాంకు ఖాతా రిజస్టరై ఉండాలి. 


చదవండి: పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పథకాలను ఖాతాతో లింకు చేశారా?

Advertisement
Advertisement