నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ

Rbi Increased Incentives For Banks For Distribution Of Coins - Sakshi

ముంబై: ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’లో భాగంగా నాణేల చెలామణీపై బ్యాంకులకు ప్రోత్సహకాలు పెంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రటించింది. ఇప్పటి వరకూ బ్యాగ్‌కు రూ.25 ప్రోత్సాహకం ఉంటే దీనిని రూ.65కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

గ్రామీణ, చిన్న స్థాయి పట్టణాల విషయంలో అదనంగా మరో రూ.10 ప్రోత్సాహకంగా లభిస్తుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. నాణేల పంపిణీ విషయంలో తమ బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవలను మరింత వినియోగించుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

చదవండి : బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 6.55 శాతం 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top