RBI: ఆ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్బీఐ..! అగమ్యగోచరంలో ఖాతాదారులు..!

RBI Cancels Licence Of Maharashtra-Based Independence Co-Operative Bank - Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే నిబంధనలను పాటించని ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా వదిలిపెట్టకుండా భారీగా జరిమానాను విధించింది  ఆర్బీఐ . ఇక తాజాగా ఆర్బీఐ మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా..!
ఇండిపెండెన్స్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ నిబంధనలను పాటించనందున బ్యాంకింగ్‌ కార్యకలాపాలను సీజ్‌ చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదే బ్యాంకు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ ఆంక్షలను విధించింది. దీంతో ఆరు నెలల వరకు ఖాతాదారులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోనే అవకాశాన్ని కోల్పోయారు. బ్యాంకుపై ఆంక్షలు విధించినా పరిస్థితులు మారకపోవడంతో బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.  ఈ బ్యాంకు ఖాతాదారుల  ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అగమ్యగోచరంగా ఖాతాదారుల పరిస్థితి..!
ఆర్బీఐ నిర్ణయంతో ఇండిపెండెన్స్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ ఖాతాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ప్రతి డిపాజిటర్ DICGC చట్టం- 1961లోని నిబంధనలకు లోబడి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి ఐదు లక్షల రూపాయల ద్రవ్య పరిమితి వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించేందుకు అర్హులని ఆర్బీఐ తెలిపింది. ఇక బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం...99 శాతం కంటే ఎక్కువ మంది డిపాజిటర్లు డిఐసిజిసి చట్టం ప్రకారం తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.

చదవండి: జుకర్‌బర్గ్‌ కొంపముంచిన ఫేస్‌బుక్‌ యూజర్లు..! తను మునిగిపోయి.. అదానీ, అంబానీల నెత్తిన పాలు పోశాడు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top